బాక్సాఫీసు వద్ద ‘బలగం’ హవా.. మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్

by Hamsa |   ( Updated:2023-05-09 06:01:49.0  )
బాక్సాఫీసు వద్ద ‘బలగం’ హవా.. మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్
X

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన ‘బలగం’ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోవడంతో పాటు ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంది. ఈ సినిమా అందరితోనూ కంటతడి పెట్టించింది. ఈ చిత్రానికి ఇప్పటికే లాస్ ఏంజిల్స్ అవార్డ్స్‌లో ఉత్తమ డైరెక్టర్, సినిమాటోగ్రఫీకి పురస్కారాలు వరించాయి. 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ జ్యూరీ కేటగిరీలోనూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో పురస్కారం దక్కింది. రిలీజైన నాటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద ‘బలగం’ హవా తగ్గడం లేదు. తాజాగా, ఈ సినిమాకు మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రియదర్శికి ఉత్తమ నటుడు, కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య)కు ఉత్తమ సహాయనటుడు విభాగంలో స్వీడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు వచ్చాయి. వారికి అభినందనలు తెలుపుతూ వేణు వారి ఫొటోలను షేర్ చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more:

జపాన్‌లో 200 డేస్ కంప్లీట్ చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’


Advertisement

Next Story