ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ‘Baby’ చిత్రం యాక్టర్

by Anjali |   ( Updated:2023-07-19 06:24:58.0  )
ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ‘Baby’ చిత్రం యాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బేబి’. ఈ చిత్రంపై విడుదలకు ముందే ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. రిలీజ్ తర్వాత అంచనాలకు మించి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటుంది. ఇందులో విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అశ్విన్ ఈ మూవీకి ముందే ‘అనగనగా ఓ ప్రేమ కథ’ చిత్రం ద్వారా హీరోగా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

అంతేకాకుండా దర్శకత్వం కూడా ఈయనే వహించాడు. ఆ తర్వాత ‘థాంక్యూ బ్రదర్’ సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత ‘మనసానమ:’ అనే 16 నిమిషాల షార్ట్ ఫిలింలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు తీసుకుని సెన్సేషనల్ సృష్టించింది. అలాగే మొట్టమొదటి షార్ట్ ఫిలింగా గిన్నిస్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న బన్నీ బ్యూటీ?

టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఇవే!

Advertisement

Next Story