- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ డైలాగ్ రాసినందుకు సారీ చెబుతున్న బేబీ డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్దా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇప్పుడ ఎక్కడ చూసిన యూత్‌లో ఈ సినిమా పేరే వినిపిస్తుంది. విమర్శలు వస్తున్నప్పటికీ సినిమా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘బేబీ’ సినిమా బాగా ఆడుతుంది అనుకున్నాను కానీ, ఈ స్థాయి రెస్పాన్స్ దక్కుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. బూతు డైలాగ్స్ కారణంగానే ఈ సినిమా ఆడుతుంది అనడంలో నిజం లేదు. ఎందుకంటే సినిమాలో బూతు డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి ఉన్న ప్రేమ గాఢతను చెప్పడం కోసం రాశాను. ‘ముందు తెరవాల్సింది కళ్లు కాదు..’ అనే డైలాగ్ రాశాను. అందుకు నేను సారీ చెబుతున్నాను. ఆ డైలాగ్ రాయకుండా ఉండాల్సింది. ఫ్యామిలీతో సినిమా చూడడానికి ఇబ్బంది పడుతున్నాం అని ఆడియన్స్ అన్నారు. అలాగే థియేటర్ వాళ్లు కూడా ఇదే మాట అన్నారు. కానీ, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారు. ఇక పరిస్థితులను బట్టి అమ్మాయి తప్పు చేసిందని చూపించాను. అంతేకానీ ఆ అమ్మాయి పాత్ర నుంచి ఎటువంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. వైష్ణవి తన క్యారెక్టర్‌కి న్యాయం చేసింది కాబట్టే సినిమా ఇంత మంచి హిట్ అయింది’’ అంటూ చెప్పుకొచ్చారు.
Vaishnavi Chaitanya : ఏ మాత్రం తప్పటడుగులేసిన ‘బేబి’ పని అవుట్.. ..