- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Baahubali’ కట్టప్ప ఇంట తీవ్ర విషాదం..
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతం బాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మరణ వార్త విన్న వెంటనే హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కు పయనమైనట్లు సమాచారం. నతంబాల్ కు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్.. కుమార్తెలు కల్పన, రూప. ఇక సత్యరాజ్ కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు తాను నటించిన సినిమాలు చూడటం ఇష్టం అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
తాజాగా, కోలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్.. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. “నటుడు సోదరుడు శ్రీ సత్యరాజ్ తల్లి నతంబాల్ మరణవార్త విని బాధపడ్డాను. అమ్మయ్యర్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సోదరుడు సత్యరాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలిలో కట్టప్ప పాత్రలో ఆయన నటించి మెప్పించాడు. ఆ సినిమా తర్వాత నుంచి ఆయనను కట్టప్ప అనే పిలవడం మొదలుపెట్టారు.