- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
S. S. Rajamouli : ఆ మూవీ కోసం రాజమౌళి ఎంత పెద్ద రిస్క్ చేశాడో తెలుసా?
దిశ, సినిమా: మన మీద మనకున్న నమ్మకమే కొండంత ధైర్యాన్నిస్తుంది అంటారు. ఈ విధమైన నమ్మకంతోనే ముందడుగు వేసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమా కోసం పెద్ద రిస్కే చెశాడట. మూవీస్ కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోతే, భారీ ఎత్తున నష్టం వాటిల్లితే రోడ్డున పడే చాన్సెస్ కూడా ఉంటాయి. అయితే తాజాగా ‘బాహుబలి’ మూవీ విషయంలో ఇటువంటి లావాదేవీల గురించిన కొన్ని విషయాలు బయట పెట్టాడు రానా దగ్గుపాటి. ‘బాహుబలి కోసం ఏకంగా రూ. 180 కోట్లు అప్పు చేశారు. అది కూడా 24% వడ్డీకి తెచ్చిందే. నాలుగున్నరేళ్ల పాటు ఈ మొత్తానికి రెండు రూపాయల చొప్పున వడ్డీ కట్టారు. ఇక ఈ మూవీ రిలీజై వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ ఇందులో నిర్మాతకు మిగిలిందేమీ లేదు. ఇంకా అప్పు మిగిలే ఉంది. ఇక ‘బాహుబలి 1’ బడ్జెట్‌లో కొంత భాగంతో ‘బాహుబలి 2’ కూడా షూట్ చేశారు. అయితే రెండవ భాగం వరల్డ్ వైడ్‌గా రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ‘బాహుబలి 2’ ఆడకపోయుంటే గనుక నిర్మాత దారుణంగా రోడ్డునపడే వాడు. ఆ నష్టం ఊహించనిది’అని చెప్పుకొచ్చాడు రానా.
Also Read..