సల్మాన్‌కు తల్లి లేదా వదినగా నటించలేను: ఆయేషా

by sudharani |
సల్మాన్‌కు తల్లి లేదా వదినగా నటించలేను: ఆయేషా
X

దిశ, సినిమా : సీనియర్ యాక్ట్రెస్ ఆయేషా జుల్కా నటుడు సల్మాన్ ఖాన్ తల్లిగా, లేదా వదినగా నటించడం ఇష్టం లేదంటోంది. ఆమె నటించిన తాజా సిరీస్ 'హుష్ హుష్' పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్న నటి.. కెరీర్, క్యారెక్టర్ అనుభవాలను పంచుకుంది. కొంతకాలంగా యాక్షన్‌కు దూరంగా ఉన్న ఆయేషా.. మళ్లీ తిరిగి తెరపైకి రావడాన్ని అభిమానులు సంతోషంగా స్వాగతించారని చెప్పింది. ఇక ఇండస్ట్రీలో మహిళల పాత్రలకు ప్రాముఖ్యత పెరిగినట్లు గమనించానన్న ఆమె.. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, మార్పు స్పష్టంగా కనిపించిందని వెల్లడించింది. కానీ తాను సల్మాన్ లేదా సహ నటుల్లో ఎవరితో కలిసి పనిచేసినా అకస్మాత్తుగా వారి బాబి, లేదా తల్లిగా నటించలేనంటూ ఫన్నీగా చెప్పింది. చివరగా మానసికంగానూ అలాంటి పాత్రలు చేయడాకి సిద్ధంగా లేనన్న ఆయేషా.. మంచి పాత్రలు చేయడానికే ఎదురు చూస్తున్నట్లు చెబుతూ ముగించింది.

Advertisement

Next Story

Most Viewed