‘ఔను.. నేనింతే’.. గ్రాండ్‌గా మూవీ లాంచ్..

by Vinod kumar |
‘ఔను.. నేనింతే’.. గ్రాండ్‌గా మూవీ లాంచ్..
X

దిశ, సినిమా: యం. ఎ. సత్తార్ సమర్పణలో శ్రీ సత్య విధుర మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘ఔను.. నేనింతే!!’. రామ్ కార్తీక్, ప్రిష జంటగా నటిస్తున్న చిత్రానికి డి. వి. కె. నాగేశ్వరరావు దర్శకులు కాగా.. జి. వి. చౌదరి, నాగరాజు చిర్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరగ్గా.. మూవీ లాంచింగ్ ఈవెంట్‌కు సీనియర్ నటులు పృథ్వీ, అనీష్ కురువెళ్ల, రఘు కుంచె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పృథ్వీ క్లాప్ కొట్టగా, అనీష్ కురువెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర సమర్పకులు యం. ఏ. సత్తార్ గౌరవ దర్శకత్వం వహించారు.

Advertisement

Next Story