బ్రేకింగ్: సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి

by Satheesh |   ( Updated:2023-02-19 12:42:41.0  )
బ్రేకింగ్: సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి
X

దిశ, శేరిలింగం పల్లి: సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి జరిగింది. గచ్చిబౌలిలోని తన నివాసం ముందు పార్క్ చేసిన కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని నరేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గచ్చిబౌలి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారుని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిపై కూడా దుండగులు దాడి చేశారని తెలిపారు. తన మూడో భార్య రమ్య రఘుపతిపై నరేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి తన ఇంటిపై దాడి చేయించిందని ఆయన ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story