ఆస్కార్‌‌కు ‘జవాన్’.. అట్లీ కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-09-19 07:21:18.0  )
ఆస్కార్‌‌కు ‘జవాన్’.. అట్లీ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’ హవా ఇంకా కొనసాగుతుంది. కాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ అట్లీ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘జవాన్’ సినిమాను ఆస్కార్‌‌కు పంపాలనుకుంటున్నట్లు తెలిపాడు. ‘అంతా అనుకున్నట్లు జరిగితే ‘జవాన్’ మూవీ ఆస్కార్‌కు వెళ్తుంది. ఈ సినిమా వెనుక ఎంతోమంది శ్రమ ఉంది. డైరెక్టర్, టెక్నీషియన్స్‌, హీరో, హీరోయిన్‌ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ తాము నటించిన మూవీకి ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌, నేషనల్‌అవార్డ్స్‌ వంటివి రావాలనే కోరుకుంటారు. నేను కూడా అంతే. నాకు జవాన్‌‌ను ఆస్కార్‌కి తీసుకెళ్లాలని ఉంది. షారుఖ్‌ సర్‌తో మాట్లాడి దీనిని ఆస్కార్‌కి పంపించేందుకు ట్రై చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అట్లీ కామెంట్స్‌ తెగ వైరల్ అవుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read More..

జవాన్ డైరెక్టర్ తిట్టాడు బోరున ఏడ్చసా.. దాన్ని ఎప్పటికీ మర్చిపోను: సిరి హనుమంత్

Advertisement

Next Story