- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ క్షణం తన భార్యకు విడాకులు ఇద్దామనుకున్న శివబాలాజీ.. ఆ ఒక్క సలహాతో ఏం చేశాడంటే !
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు శివ బాలాజీ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా వెండితెరకు పరిచయమైన ఇతను ‘ఆర్య’, ‘చందమామ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. శివ బాలాజీ, నటి మధుమిత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. మధు మిత కూడా చాలా చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. శివ బాలాజీ మాట్లాడుతూ ‘ లవ్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం దూరంగా ఉండేవాళ్లం.. అలా ఒకరిపై మరొకరికి చాలా ప్రేమ ఉండేది. కానీ పెళ్లయ్యాక ఇద్దరం కలిసి ఉండటంవల్లనేమో కానీ అఫెక్షన్ తగ్గింది. మనస్పర్థలు మొదలయ్యాయి. చీటికి మాటికి గొడవలు అవుతుండేవి. దీంతో మొదట అబ్బాయి పుట్టాక విడాకులు తీసుకోవాలనుకున్నా. అయితే అప్పుడు మా కజిన్ కొద్ది రోజులు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. సరేనని దూరంగా ఉన్నాం. దీంతో కొద్ది రోజులకు ఒకరంటే మరొకరికి ఎంతిష్టమో తెలిసొచ్చింది. మనస్పర్థలు తొలగి మా బంధం మరింత బలపడింది. ఇకముందు ఏమైనా గొడవలు వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలో మాకంటూ కొంచెం అవగాహన ఏర్పడింది’ అంటూ చెప్పుకొచ్చాడు శివ బాలాజీ.
Read more:
Madhumitha: మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన హీరో భార్య.. వీడియో వైరల్
Pushpa-2: పుష్ప-2 సినిమాలో రష్మిక చనిపోతుందా?
‘నువ్వేం చెప్పావో నాకు బాగా అర్థమైంది’.. ఐశ్వర్య కామెంట్స్‌పై రష్మిక