- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా సత్తా ఏంటో ఆయనకు బాగా తెలుసు.. అందుకే డైరెక్ట్ పిలిచాడు
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జియా శంకర్ తన నటనా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రీసెంట్‌గా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటలను బయటపెడుతున్నట్లు తెలిపింది. అదృష్టవశాత్తు తనకు వచ్చిన ప్రతి అవకాశం భిన్నంగా, ఉత్తేజకరమైనదిగానే ఉందన్న ఆమె.. 'ఇలా నాకు మాత్రమే జరిగిందని భావిస్తున్నా. నేను ఏ సినిమా చేసిన ఉత్సాహంగా గడిచింది.
చాలా కొత్తగా అనిపించింది. నాకు స్టేజ్ ఫియర్ ఉన్నప్పటికీ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించాను. నిజంగా ఇలాంటి అవకాశాలను పొందుతున్నందుకు చాలా అదృష్టవంతురాలిని. ఇండస్ట్రీలో నాకు తెలిసిన వారందరూ నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని నమ్ముతారు. 'వేడ్' కోసం ఆడిషన్ చేయాలా అని రితీష్‌ని అడిగితే.. 'నీ పనిని చూశాను. ఈ క్యారెక్టర్‌ను సులభంగా చేయగలవని నాకు తెలుసు అన్నారు. ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే చిత్రంలోకి స్వాగతించారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందరికీ వస్తాయన్న ఆమె.. వచ్చిన ప్రతీ చాన్స్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి : 'నా జీవితం అంతకు ముందులా మారితే బాగుండు'.. Samantha ఎమోషనల్