- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ashwin Babu: మరో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న అశ్విన్.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
దిశ, సినిమా: యంగ్ హీరో అశ్విన్ బాబు తాజా చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డైరెక్టర్ అప్సర్ తెరకెక్కించాడు. ఈ మూవీ నుంచి రిలీజైనా టీజర్, ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించడంతో ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయింది. అయితే.. మూవీలో కొన్ని సీన్స్ పర్వలేదు అనిపించుకున్నప్పటికీ.. ఓవరల్‌గా థ్రిల్ చేయలేదని తెలుస్తోంది. అశ్విన్ బాబు యాక్షన్, డైరెక్టర్ అప్సర్ ఖాన్ చక్కటి స్క్రీన్ ప్లే ప్రదర్శించినప్పటికీ.. కథ బలహీనంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి షో పూర్తి చేసుకున్నప్పటికీ ఫైలన్‌గా ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు హీరో అశ్విన్ బాబు పుట్టిన రోజు కావడంతో.. మరో సినిమా అప్‌డేట్ వచ్చింది. ఈసారి కూడా ఓ డిఫరెంట్ కన్సెప్ట్ పట్టాడు అశ్విన్. మెడికో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ మూవీకి మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెండర్ 3గా టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ‘#AB09’ అనే వర్కిగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో నుంచి అశ్విన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో లుక్ మూవీపై క్యురియాసిటీ పెంచే విధంగా ఉంది. కాగా.. అశ్విన్ సరసన రియా సుమన్ నటిస్తుండగా.. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.