- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి విజయంలోనూ వాళ్ల సపోర్ట్ ఉంది.. అదే నా బలం
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఆశిక రంగనాథ్ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానంటోంది. కళ్యాణ్ రామ్ తాజా చిత్రం 'అమిగోస్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'కర్ణాటకలో పుట్టిపెరిగిన నాకు అమ్మానాన్నలతో కలిసి సినిమాలు చూడటమే తప్పా.. నటించాలని ఎన్నడూ అనిపించలేదు. ఓసారి కాలేజీలో అందాల పోటీలో పాల్గొని 'క్లిన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్'గా గుర్తింపు తెచ్చుకున్నా.
ఆ ఫొటోలు బయటకు రావడంతో సినిమా అవకాశాలు మొదలయ్యాయి. కానీ, నేను సంగీతంలో స్థిరపడాలని మా అమ్మ కోరుకుంది. దీనికోసం నాకు డ్యాన్స్‌తో పాటు పలు కళలు నేర్పించింది. నా ప్రతి విజయంలోనూ మా పేరెంట్స్ సహకారం ఉందని గర్వంగా చెబుతా. వాళ్లే నా బలం. ఇక కళ్యాణ్ రామ్ సహకారంతో మొదటిసినిమాను బాగా చేయగలిగాను. మాంసాహారంలో అమ్మ చేసే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నా మొదటి క్రష్ రణ్‌వీర్‌సింగ్. పునీత్ రాజ్ కుమార్‌తో సినిమా చేయాలనే కోరిక తీరలేదు. రాజమౌళిగారితో పని చేయాలని ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.