మీ నాన్నను చూసి నేర్చుకో.. ఆయన పరువు తీయకు: ఆర్యన్‌పై ఫ్యాన్స్ ఫైర్

by Harish |   ( Updated:2023-08-11 05:56:40.0  )
మీ నాన్నను చూసి నేర్చుకో.. ఆయన పరువు తీయకు: ఆర్యన్‌పై ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్ నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆయన.. ముంబై డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాడు. ఇదిలావుంటే.. తాజాగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా 'ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహబత్' చిత్ర స్క్రీనింగ్ ముంబైలో జరిగింది. అయితే దీనికి హాజరైన ఆర్యన్‌ను ఫొటోలు కావాలని విలేఖర్లు అడగగా.. వాళ్లను పెద్దగా లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. కనీసం ఒక్క ఫొటో కూడా తీసుకోనివ్వకుండా పొగరుగా చూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. 'ఏం లేకున్నా యాటిట్యూడ్‌కి మాత్రం తక్కువ లేదు. మీ నాన్నని చూసి నేర్చుకో'. 'నీ ప్రవర్తనతో షారుఖ్ పరువు తీస్తున్నావ్' అంటూ తిట్టిపోస్తున్నారు.

Advertisement

Next Story