అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్

by Kavitha |
అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు.

అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ దాదాపుగా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమాని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 17న లేదా 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నదట. కాగా ఈ చిత్రానికి ‘కాంతార’(Kanthara) ఫేమ్ అజనీష్ లోక్ నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు.


Next Story

Most Viewed