Bhagavanth Kesari : భగవంత్ కేసరి నుంచి అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ అదుర్స్

by Shiva |   ( Updated:2023-10-07 13:01:58.0  )
Bhagavanth Kesari : భగవంత్ కేసరి నుంచి అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ అదుర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : నటసింహ బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఆ మూవీకి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. లెటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. మూవీ టీం అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ పవర్ ప్యాక్ కాంబినేషన్‌లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భగవంత్ కేసరి థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

Next Story