Anushka Shetty: తెలుగు రాష్ట్రాల మహిళలకు అనుష్క స్పెషల్ గిఫ్ట్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-09-13 11:50:51.0  )
Anushka Shetty: తెలుగు రాష్ట్రాల మహిళలకు అనుష్క స్పెషల్ గిఫ్ట్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చాలా రోజులకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు డైరెక్షన్‎లో యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టితో స్వీటీ కలిసి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలై హిట్ టాక్‏ను సొంతం చేసుకుంది. తాజాగా, అనుష్క శెట్టి మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ గురువారం రెండు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫ్రీ మార్నింగ్ షో వేయబోతున్నట్లు అనుష్కనే స్వయంగా అనౌన్స్ చేసింది. ఈ బంపర్ ఆఫర్‎ను మహిళలంతా వినియోగించుకోవాలని స్వీటినే స్వయంగా కోరింది. ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కలిసి థియేటర్స్‎కి రావాలంటూ ఓ వీడియోను అనుష్క తన ట్విటర్ అకౌంట్లలో షేర్ చేసింది.

Advertisement

Next Story