స్లిమ్ లుక్‌తో షాకిచ్చిన అనుష్క శెట్టి.. గుడ్ న్యూస్ చెప్పేసిందిగా!

by Hamsa |   ( Updated:2024-03-12 07:14:56.0  )
స్లిమ్ లుక్‌తో షాకిచ్చిన అనుష్క శెట్టి.. గుడ్ న్యూస్ చెప్పేసిందిగా!
X

దిశ, సినిమా: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుని కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించింది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బాహుబలి సినిమా చేసి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సడెన్‌గా బరువు పెరగడంతో కొద్ది కాలంపాటు సినిమాలకు పూర్తిగా దూరమైంది. మళ్లీ 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ మళ్లీ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే..తాజాగా, అనుష్క శెట్టి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో ఆమె స్లిమ్‌గా కనిపించడంతో అవి చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అయితే అనుష్క శెట్టి ఓ తమిళ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది. దీంతో చిత్రయూనిట్ శ్రీకృష్ణుడి విగ్రహం, పూల బోకే ఇచ్చి వెల్‌కమ్ చెప్పారు. ఈ ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేయడంతో అవి క్షణాల్లో నెట్టింట వైరల్ అయిపోయాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఇన్నాళ్లకు బరువు తగ్గి సినిమాల్లోకి వస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పేసిందని అంటున్నారు. కొంత మంది నెటిజన్లు మాత్రం ఇంత తొందరగా బరువు తగ్గిందంటే.. మళ్లీ సినిమాల్లోకి వస్తుందా? లేక పెళ్లి చేసుకుంటుందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story