Prabhas పై ప్రేమను మరోసారి ఆ విధంగా చూపించిన Anushka

by samatah |   ( Updated:2023-07-01 04:18:33.0  )
Prabhas పై ప్రేమను మరోసారి ఆ విధంగా చూపించిన Anushka
X

దిశ, వెబ్‌డెస్క్ : అనుష్క, ప్రభాస్ జోడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్‌ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే వీరు ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ చెత్త టాక్ అందుకుంది. ఇందులో రాముడి పాత్ర ప్రభాస్‌కు సెట్ కాలేదంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. కాగా వీటిపై అనుష్క ఘాటుగా స్పందించింది. మాట్లాడినంత ఈజీ కాదు రాముడు పాత్రలో కనిపించడం..ఆ పాత్రలో ప్రభాస్ చూడముచ్చటగా ఉన్నారు. మరి ఎందుకు అందరూ పదేపదే ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఆ పాత్రను నటించి చూపిస్తే ఆ బాధ మీకు తెలుస్తుందంటూ స్పందించింది. ఇక దీంతో అనుష్కకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమో మరోసారి తెలిపింది అంటూ నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Naga Chaithanya కంటే ముందు.. Samantha ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Advertisement

Next Story