Anushka Shetty : లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో రాబోతున్నా అనుష్క ..

by Kavitha |   ( Updated:2024-02-09 08:45:09.0  )
Anushka Shetty : లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో రాబోతున్నా అనుష్క ..
X

దిశ, సినిమా : ‘సూపర్’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తన అందం నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది అనుష్క శేట్టి. ‘విక్రమర్కుడు’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నా ఈ చిన్నవి ‘బాహుబలి’ తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. దీం తర్వాత అనుష్క ఫుల్ బిజీ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు కానీ అవకాశాలు వచ్చి స్వీటీకి పెద్ద హిట్‌ మాత్ర పడలేదు. దీంతో ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఇచ్చెసింది.

కాగా మొత్తనికి గత ఏడాది తన అభిమానుల కొరకు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ మూవీతో వచ్చి పర్వలేదు అనిపించుకుంది. అయితె అనుష్క కి లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో మెప్పించడంలో అగ్ర కథానాయికగా పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. ‘అరుంధతి’, ‘నాగవల్లి’, ‘వేదం’, ‘సైజ్‌ జీరో’ వంటి చిత్రలొ విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నా ఈ ముద్దుగుమ్మ ‘పంచాక్షరి, ‘రుద్రమ దేవి’ల్లోనూ టైటిల్‌ రోల్‌ చేసింది. కానీ ‘భాగమతి’ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. కాగా తాజా సమాచారం ప్రకారం దర్శకుగు క్రిష్‌ అనుష్క తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Advertisement

Next Story