Anusha Dandekar : మేము దాని గురించి మాట్లాడితే మగాళ్లు జీర్ణించుకోలేరు.. అనూష

by Hamsa |   ( Updated:2023-05-18 10:14:01.0  )
Anusha Dandekar : మేము దాని గురించి మాట్లాడితే మగాళ్లు జీర్ణించుకోలేరు.. అనూష
X

దిశ, సినిమా : మహిళలు సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోవడం మగాళ్లు జీర్ణించుకోలేరంటోంది అనూష దండేకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. యాంకరింగ్ ప్రపంచంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాలు, రెమ్యూనరేషన్ గ్యాప్ గురించి తన అనుభవాలను షేర్ చేసుకుంది. గతంలో ఓ షోలో భాగంగా మేల్ కో హోస్ట్‌తో సమాన ప్రసార సమయం కావాలని అడిగినప్పుడు తనపై దారుణంగా విరుచుకుపడ్డాడని చెప్పింది. అలాగే పారితోషికం విషయంలోనూ ఆయనకంటే తక్కువ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తే కెరీర్ లేకుండా చేస్తానన్నట్లు ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది. ‘నేను తనతో సమానమైన ప్రసార సమయాన్ని కోరాను. దీంతో నా ప్రతిభను అణిచివేసేలా వ్యవహరించాడు. నన్ను అణగదొక్కేందుకు ప్రతయత్నించాడు. అయినా నేను మరింత ముందుకు దూసుకుపోయేందుకు మొగ్గుచూపాను’ అంటూ వివరించింది. ఇక అనూష అనేక MTV షోలను హోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి: ఏదైనా రహస్యంగానే చేయాలి.. లేదంటే నాశనమే: ఛార్మీ

ఇంట్లో డోర్ వేసుకొని ఆ వీడియోస్ చూస్తున్న Mrunal Thakur !

Advertisement

Next Story