ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి

by Anjali |   ( Updated:2023-08-09 05:48:02.0  )
ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మలయాళ దర్శకుడు.. స్క్రీన్ రైటర్ సిద్ధిక్(69) గత నెల రోజులుగా అనారోగ్యం కారణంగా కొచ్చిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. సోమవారం (ఆగస్టు 06) ఆయనకు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా ఉందని నిన్న సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే సిద్ధిక్ మంగళవారం రాత్రి 9. 13 గంటలలకు మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు భార్య సుజిత, ముగ్గురు పిల్లలున్నారు.

సిద్ధిక్ మరణ వార్త విన్న కుటుంబీకులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈయన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక సీనియర్ డైరెక్టర్ ఫాజిల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. అనంతరం తన ఫ్రెండ్ లాల్‌తో కలిసి సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. వీరిద్దరు కలిసి.. ‘రామ్జీరావు స్పీకింగ్, గాడ్ ఫాదర్, ఇన్ హరిహర్ నగర్, వియత్నాం కాలనీ, కాబూలీ వాలా’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశారు.

Read More: సుమ షో లో వై.ఎస్ షర్మిలపై సెటైర్స్.. చివరకు వీళ్లు కూడా వదలడం లేదుగా (వీడియో)

Advertisement

Next Story