- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jayam Ravi: విడాకులకు సిద్ధమైన మరో స్టార్ హీరో.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం (పోస్ట్)
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి చెందిన సీని సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది రోజులకే మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇండస్ట్రీలో డైవర్స్ కామన్ అయిపోయింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్యతో మనస్పర్థలు వచ్చాయని విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, జయం రవి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసి అందరికీ షాకిచ్చాడు. ఇద్దరి ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ విడుదల చేశాడు.
‘‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ఒక ప్రయాణం. ఇందులో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది నా ప్రయాణాన్ని తెరపై నన్ను చూసి అభిమానించడంతో పాటు అత్యంత ప్రేమను పంచి మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడూ నా అభిమానులతో, మీడియాతో నిజాయితీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తుంది. ఎన్నో ఆలోచనల తర్వాత చర్చలు జరిపిన తర్వాతనే నేను నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలని కఠిన నిర్ణయానికి వచ్చాం. మా ఇద్దరి మంచి కోసం ఆలోచించే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను.
ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. కాబట్టి దయచేసి పుకార్లు రాయకండి. నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటా. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ ఇలాగే నాకు మద్దతుగా నిలుస్తారని నేనే ఆశిస్తున్నాను’’ అని నోట్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం జయం రవి పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇలా సడెన్‌గా విడాకులు ప్రకటించడంతో ఇండస్ట్రీలో జయం రవి విడాకుల ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది.