అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో స్టార్ హీరో ఫిక్స్..? హైప్ పెంచుతున్న న్యూస్

by Kavitha |   ( Updated:2025-03-08 15:15:00.0  )
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో స్టార్ హీరో ఫిక్స్..? హైప్ పెంచుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గంగోత్రి’(Gangothri) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించాడు.

అలాగే ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఇక ఈ మూవీ ప్రీమియర్ షో కి వెళ్లినప్పుడు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ చనిపోగా అతని కుమారుడు హాస్పిటల్‌లో చికిత్స్ పొందుతున్నాడు. ఈ ఘటనలో బన్నీ జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌(Trivikram)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. స్నేహారెడ్డి(Sneha Reddy)ని ప్రేమించి 2011 మార్చి 6న ఆమెను బన్నీ పెళ్లి చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్‌‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి రోజుకో న్యూస్ బయటికి వస్తుంది. ఈ క్రమంలో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. ఇక క్రేజీలో వస్తున్న మరో హీరో ఉన్నారన్న విషయం నెట్టింట వైరల్‌గా మారింది.


Read Also..

నా 16ఏళ్ల సినీ కెరీర్‌లో అలా చేయండి అని నేను ఎప్పుడూ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నా.. నాని ఎమోషనల్ కామెంట్స...

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed