RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-24 02:34:54.0  )
RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ ప్రభంజనం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమ నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను కట్టి పడేశారు. అయితే ఈ సినిమాకు తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ అవార్డు సాధించింది. టాప్ గన్ మ్యావరిక్, అవతార్: ద వే ఆఫ్ వాటర్ వంటి హాలీవుడ్ హిట్ సినిమాలను వెనక్కి నెట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆర్‌ఆర్‌ఆర్ సొంతం చేసుకోవడం విశేషం.

గతేడాది ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను జపాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్కడ సైతం ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఆస్కార్‌లో సైతం ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నామినేషన్‌లో ఉంది. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడంతో తెలుగు సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

Also Read...

రాజమౌళిని చంపడానికి స్క్వాడ్ : RGV సంచలన ట్వీట్

Advertisement

Next Story