సంక్రాంతి రేసులో మరో మూవీ.. 'కళ్యాణం కమనీయం' టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్..

by Prasanna |   ( Updated:2023-10-10 11:13:10.0  )
సంక్రాంతి రేసులో మరో మూవీ.. కళ్యాణం కమనీయం టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా " కళ్యాణం కమనీయం ". ఈ సినిమాలో అతనికి జోడీగా ప్రియా భవాని నటిస్తుండగా, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమా పోస్టర్‌లో హీరో, హీరోయిన్ సోఫాలో కూర్చుని, ఇంటికి నలువైపులా పచ్చని చెట్లు.. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. వాస్తవానికి వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర‌సింహా రెడ్డి' సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలాగే తమిళ హీరో విజయ్ కూడా 'వారీసు' తెలుగులో 'వారసుడు' కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ నేపథ్యంలో.. 'కళ్యాణం కమనీయం' సినిమా కూడా సంక్రాంతి పోటీలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో..ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్‌గా చేసుకుని మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story