రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ సినిమా ట్రైలర్ విడుదల

by Hamsa |
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ సినిమా ట్రైలర్ విడుదల
X

దిశ, సినిమా: మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా ‘మిస్టర్ ఇడియ‌ట్‌’. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజే ఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ ఎల్ పి పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

హైదరాబాద్‌లో ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవితేజ ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. అందులో నేను కూడా ఉన్నా. ఈ ఫంక్షన్‌కు పిలిచినప్పుడు మాధవ్‌ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చాను. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి.

చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు మాధవ్. రవితేజ గారి స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మా సినిమా బాగుందని అనుకోవడం వేరు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిచేసుకున్నాం అని చెప్పడం గొప్ప విషయం. ఈ టీమ్ అలాంటి కరెక్షన్స్ చేసుకుంది అంటే సక్సెస్ అందుకున్నట్లే అనిపిస్తోంది. నవంబర్‌లో రిలీజ్ అవుతున్న ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ సినిమాను అందరూ చూడండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ రవిచంద్ర ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా’’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed