- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > రణ్‌బీర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన రష్మిక.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్ (వీడియో)
రణ్‌బీర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన రష్మిక.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్ (వీడియో)

X
దిశ, సినిమా: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నాల లేటెస్ట్ మూవీ ‘యానిమల్’ నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజైంది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమానుంచి ‘Satranga.. Aada Tera Ishq’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ తాజాగా విడుదలచేశారు. ఈ వీడియో సాంగ్‌లో భార్యభర్తల మధ్య రిలేషన్‌లో గ్యాప్ పెరిగినట్లు తెలుస్తుండగా పాట మొత్తం రష్మిక ఏడుస్తూనే కనిపించింది. ఇక సిద్దార్థ్-గరిమా రాసిన పాటను శ్రేయాస్ పురానీ కంపోజిషన్‌లో పాపులర్ సింగర్ అర్జీత్ సింగ్ ఆలపించగా అర్జీత్ వాయిస్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే ఈ పాట రిలీజైన గంటలోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.
Next Story