Anjali: బోల్డ్ సీన్స్‌లో నటించలేక చాలా ఎమోషనల్ అయ్యాను.. టాలీవుడ్ హీరోయిన్ వైరల్ కామెంట్స్

by sudharani |
Anjali: బోల్డ్ సీన్స్‌లో నటించలేక చాలా ఎమోషనల్ అయ్యాను.. టాలీవుడ్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ అంజలి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లతో కూడా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే అంజలి నటించిన తాజా వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో జూలై 19నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అందులో అంజలి వేశ్య పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. పాత్రకు తగ్గట్లు కొన్ని బోల్డ్ సీన్స్‌లో కూడా నటించింది ఈ బ్యూటీ.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ‘బహిష్కరణ’లో బోల్డ్ సీన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘స్టార్టింగ్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అంతే కాకుండా ఒకసారైతే ఆ సీన్స్‌లో నటించిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. మొదటిసారి నేను అలాంటి పాత్రలో నటించాను అందుకే అంతా భావోద్వేగానికి గురయ్యాను. బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు సన్నద్ధం కాకపోయినా చాలెంజింగ్‌గా తీసుకుని నటించాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed