Animal Movie OTT: ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?

by sudharani |   ( Updated:2023-12-07 11:44:12.0  )
Animal Movie OTT: ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్-1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక బుధవారం నాటికి రూ. 500 కోట్ల కలెక్షన్స్ మార్కును కూడా చేరుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే ఇన్ని కోట్లు వసూలు చేయడంతో.. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల కలెక్షన్లు రాబట్టిన బాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక థియేటర్లలో సత్తా చాటుకుంటున్న ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రికార్డ్ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జనవరి 26వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story