బలపం పట్టి భామ ఒళ్లో పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసిన స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న వీడియో!

by Jakkula Samataha |
బలపం పట్టి భామ ఒళ్లో పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసిన స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న వీడియో!
X

దిశ, సినిమా : వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాలోని బలం పట్టి బామ్మ ఒళ్లో అనే సాంగ్ అందరికీ తెలిసిందే. ఇది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఊపు తెప్పిస్తుంటుంది. ఈ సాంగ్ వింటే చాలు ఎవరికైనా స్టెప్స్ వేయాలనిపిస్తుంది. అయితే తాజాగా ఈ పాట మీద స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అదిరిపోయే స్టెప్స్ వేశారు. తన స్టైల్, డ్యాన్స్‌తో అక్కడున్నవారందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డైరెక్టర్స్ అందరూ దర్శకుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ హీరో అల్లు అర్జున్, నాని వెళ్లారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో అనిల్ రావుపూడి తన డ్యాన్స్‌తో అదరహో అనిపించాడు. ప్రస్తుతం ఆయన డ్యాన్స్ చూసిన వారందరూ తనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వెంకటేష్ బలపం పట్టి బామ ఒళ్లో అంటూ తన స్టైల్, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఇది చూసిన కొంత మంది, ప్రస్తుతం ఈ డైరెక్టర్ వెంకటేష్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ సాంగ్ ఎంపిక చేసుకొని ఉండి ఉంటాడు అంటూ ముచ్చటిస్తున్నారు. ఇంకొందరేమో మీరు డైరెక్టర్ కాదు డ్యాన్సర్ కూడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన డ్యాన్స్ ఆ షోకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక బాలయ్య బాబుతో భగవంత్ కేసరి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్, వెంకటేష్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

Advertisement

Next Story