విమానంలో స్టార్ హీరో అరాచకం.. భార్య ముందే పిల్లలను

by Hajipasha |   ( Updated:2022-10-11 09:09:11.0  )
విమానంలో స్టార్ హీరో అరాచకం.. భార్య ముందే పిల్లలను
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ ఎంజెలీనా జోలీ మరోసారి మాజీ భర్త బ్రాడ్ పిట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. 2014లో బ్రాడ్‌ను వివాహం చేసుకోగా అతడు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2019లో విడాకులిచ్చేసింది. అయితే వీరిద్దరికి సంబంధించిన ఆస్తి విక్రయంపై కోర్టులో కేసు నడుస్తుండగా తాజా విచారణలో భాగంగా మరిన్ని విషయాలు బయటపెట్టింది. ఓసారి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు బాగా తాగి తనతో పాటు పిల్లలపై దాడి చేశాడని పేర్కొంది.

రాత్రి 8 గంటలకు 15 ఏళ్ల వయసున్న పిల్లలతో వాగ్వాదానికి దిగిన ఆయన.. ఉక్కిరిబిక్కిరి చేశాడని, పిల్లల మొహంపై బలంగా కొట్టాడని ఎమోషనల్ అయింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతరులపై మాటలతో దాడి చేశాడన్న నటి.. తన తల, భుజాలను గట్టిగా పట్టుకుని విమానంలో వాష్‌రూమ్ గోడకు బలంగా నొక్కిపెట్టినట్లు తెలిపింది. ఇక దీనిపై స్పందించిన బ్రాడ్.. మాజీ భార్య దుర్వినియోగ ఆరోపణలు చేస్తుందని, అవన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశాడు.

ఇవి కూడా చదవండి : పిల్లలతో నమ్రత బ్యూటిఫుల్ సెల్ఫీ.. స్పెషల్ ఎందుకంటే..?

Advertisement

Next Story