- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకు ఆ చాన్స్ లేకుండా.. నేనే మూసుకున్న.. విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ విష్ణుప్రియ. టీవీ షోలో కనిపిస్తూనే.. ఈ మధ్యకాలంలో జేడీ చక్రవర్తి ‘దయ’ వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ లోల్‌లో మెరిసింది. ఆ సినిమాతో విష్ణు ప్రియ నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. బోల్డ్ షోతో నెట్టింట రచ్చ చేస్తుంది. జిమ్ సూట్‌తో, పొట్టి పొట్టి బట్టల్లో దర్శనమిచ్చి ట్రోల్స్‌కు గురవుతుంటుంది. అంతే కాకుండా ఆమె పెట్టే పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో పాటు.. నెట్టింట వల్గర్ కామెంట్స్ కూడా గట్టిగానే వస్తాయి.
ఇక చాలా సార్లు తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై స్పందించింది విష్ణుప్రియ. అయినప్పటికీ నెగిటివిటీ మాత్రం తగ్గలేదు. దీంతో చేసేదేమి లేక ఈ మధ్య తన పోస్టుల కింద కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసుకుంది. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ మాత్రమే మెసేజ్ చేసేలా సెట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా విష్ణుప్రియ తన అభిమానులతో చిట్ చాట్ చేసేందుకు ముందుకు వచ్చింది.
ఈ క్రమంలో ఓ అభిమాని కామెంట్ సెక్షన్‌ను ఎందుకు క్లోజ్ చేస్తున్నావ్ అని అడిగాడు. దానికి విష్ణుప్రియ రిప్లై ఇస్తూ.. ‘ప్రతి ఒక్కరికీ వారి భావ వ్యక్తీకరణ ఉంటుంది.. అందరి అభిప్రాయాలను కొన్ని సార్లు నేను వ్యతిరేకించలేను.. వారి నోళ్లను మూయించలేను.. అందుకే నేను మూసుకుంటున్నాను.. వాళ్లకి అనే చాన్స్ ఇవ్వడం లేదు’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతుంది.