- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Anchor Suma : నేను మోసం చేయలేదు.. వివాదంపై స్పందించిన యాంకర్ సుమ
దిశ, సినిమా: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వాణిజ్య ప్రకటనలో నటించిన రియల్‌ఎస్టేట్ సంస్థ బోర్డ్ తిప్పేయడంతో బాధితులు సుమకు లీగల్ నోటిసులు పంపారు. ఆమె యాడ్ చూసే ఫ్లాట్స్ కొన్నామంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై సుమ తన సోషల్‌మీడియా ఖాతాలో స్పందించారు. 'రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి నేను గతంలో చేసిన వాణిజ్య ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆ యాడ్‌ను 2016 నుంచి 2018 వరకే ప్రసారం చేయాలని సదరు రియల్‌ఎస్టేట్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ వాళ్లు ఎటువంటి పర్మిషన్ లేకుండా యాడ్‌ను ఇంకా టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ సంస్థకు కూడా లీగల్ నోటిసులు పంపాను. అధికారిక చానెల్స్‌లో ప్రసారమయ్యే యాడ్స్‌లో మాత్రమే ప్రజలు నమ్మాలి' అంటూ ఆమె ఇన్‌స్టా ఖాతాలో పెట్టిన ఓ ప్రకటనలో తెలిపారు. రాజమండ్రికి చెందిన రాకీ అవెన్యూస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్లాట్స్ పేరిట జనం నుండి దాదాపుగా 88 కోట్లు డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ రియల్ ఎస్టేట్ యాడ్‌లోనే నటి, యాంకర్ సుమ నటించారు. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.