‘ఏజెంట్’ సెట్‌లో అఖిల్‌తో సందడి చేసిన యాంకర్ సుమ

by Hamsa |   ( Updated:2023-12-16 15:51:29.0  )
‘ఏజెంట్’ సెట్‌లో అఖిల్‌తో సందడి చేసిన యాంకర్ సుమ
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతోంది. అప్పటి నుంచి వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది.. అయితే ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించింది మూవీ టీమ్. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో ఏజెంట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూవీ మళ్లీ వాయిదా పడిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ఈ రోజు(ఏప్రిల్ 8) అఖిల్ బర్త్ డే సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా యాంకర్ సుమ.. అఖిల్‌తో కలిసి మూవీ షూటింగ్ సెట్‌లో ముచ్చటించింది.

ఇవి కూడా చదవండి: కనీసం ఫొటో ఫ్లాష్‌ను తట్టుకోలేకపోతున్నా సమంత.. సినిమా ఎలా తీస్తుంది?

Advertisement

Next Story