రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ఝాన్సీ..!

by Nagaya |   ( Updated:2023-11-21 15:22:58.0  )
రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ఝాన్సీ..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఝాన్సీ ఒకరు. 1997 నుంచి 2007 వరకు దాదాపుగా 10 సంవత్సరాలు, టాప్ టీవీ షోలతో దూసుకుపోయింది. హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఝాన్సీ ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టింది.

‘నా గతంలో ఆనందం కంటే ఎక్కువ బాధలే ఉన్నాయి. విడాకులు తీసుకున్న తర్వాత నా కెరీర్‌ను కాపాడుకుంటూ.. కూతురిని ప్రాణంగా చూసుకుంటూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడంలోనే నా సగం జీవితం గడిచిపోయింది. నన్ను రెండో పెళ్లి చేసుకోమని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు బలవంతం చేస్తున్నారు. కానీ నా మొదటి భర్త వల్ల నేను చాలా కష్టాలు పడ్డాను. అందుకే మళ్లీ పెళ్లిపై నాకు ఎలాంటి ఆశలు, ఆసక్తి లేదు. ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే.. నన్ను నచ్చే వ్యక్తికి సర్దుకుపోయే తత్వం ఉండాలి. అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం. ఒక ఆడపిల్ల జీవితంలో వివాహం అనేది బలం కావాలి బలహీనత అవ్వకూడదు. పెళ్లి తర్వాత నా లైఫ్‌లో నేను కష్టాలతో పాటు మోసాలు కూడా ఎక్కువే చూశాను. నేను కష్టపడి సంపాదించిన బోలెడంత డబ్బు పోగొట్టుకున్నాను. అందుకే నా రెండో పెళ్లి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాను’ అంటూ ఎమోషనల్ అయింది.

Advertisement

Next Story

Most Viewed