పెళ్లికి ముందే అతడితో రిలేషన్‌లో ఉన్న అనసూయ.. ఏకంగా 8 ఏళ్లు డేటింగ్ చేసి..

by sudharani |   ( Updated:2023-09-21 13:05:28.0  )
పెళ్లికి ముందే అతడితో రిలేషన్‌లో ఉన్న అనసూయ.. ఏకంగా 8 ఏళ్లు డేటింగ్ చేసి..
X

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై అడుగు పెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అందాల విందు చేస్తుంది. ఒక్కోసారి ఈ అమ్మడు చేసే పోస్ట్‌లు కాంట్రవర్సీలకు దారి తీస్తాయి. దీంతో నెట్టింట ట్రోల్స్ మొదలు పెడతారు నెటిజన్లు. అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా తన దారిలో తాను అందాలతో రెచ్చగొడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. అనసూయ గురించి ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే...

అనసూయ పెళ్లికి ముందే ఓ వ్యక్తితో 8 ఏళ్లు సహజీవనం చేసిందట. ఆయన మరెవరో కాదు.. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్. 2010లో వీరి వివాహం జరగ్గా.. అప్పటికీ 8 ఏళ్లు ముందు నుంచే వారు రిలేషన్‌లో ఉన్నారట. ఆ తర్వాతనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అనసూయనే తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన మ్యారేజ్‌కి ముందు నడిచిన ఈ క్రేజీ సీక్రెట్‌ను బయట పెట్టింది.

Read More..

Nara Brahmini పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన Sri Reddy.. అప్పుడేం పీ** అంటూ..

Advertisement

Next Story