అర్జున్ రెడ్డి పై యాంకర్ అనసూయ ఫైర్..

by srinivas |   ( Updated:2022-08-25 12:53:27.0  )
అర్జున్ రెడ్డి పై యాంకర్ అనసూయ ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, అనన్య కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'లైగర్'. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు విడుదలైన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది. దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ స్పందిస్తూ పూరీని ట్రోల్ చేస్తున్నారు. కథలో సత్తా లేదని.. విజయ్ కష్టమంతా వృధా అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాను ఉద్దేశిస్తూ యాంకర్ అనసూయ ట్వీట్ చేశారు. ''అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!'' అంటూ యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా విడుదల అయినప్పుడు యాంకర్ అనసూయ మాదర్* అంటూ సినిమాలో ఉన్న బూతు డైలాగ్స్ పై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి విజయ్ కి అనసూయ కి మధ్య వార్ నడుస్తూనే ఉంది. లైగర్ టాక్ నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలో అనసూయ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి పెట్టిందే అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్వీట్ పై కొందరు విజయ్ ని సపోర్ట్ చేస్తూ రిప్లై ఇస్తున్నారు.

ఈ ఫలితాన్ని పూరి, విజయ్ తట్టుకోగలరా? (వీడియో)

Advertisement

Next Story