ఆంటీ అని పిలవగానే ముద్దిచ్చిన అనసూయ

by Anjali |   ( Updated:2023-06-16 14:51:13.0  )
ఆంటీ అని పిలవగానే ముద్దిచ్చిన అనసూయ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లామర్ షో చేస్తూ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోన్న స్టార్ యాంకర్ అనసూయ తనను ‘ఆంటీ’ అంటే ఎందుకు కోపం వస్తుందో వెల్లడించింది. తాజాగా ‘విమానం’ మూవీ స‌క్సెస్ మీట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ అన‌సూయ‌ని ఆంటీ అని పిలవడంతో వెంటనే అత‌డిని ద‌గ్గరికి పిలిచి ముద్దు పెట్టింది. ‘ఆంటీ అని పిలిస్తే నాకు కోపం వస్తుంది వాస్తవమే. ఎందుకంటే వారి పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుంది. అలా పిలిస్తే ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. ఈ ట్రోలర్స్‌కు రెస్పాండ్ కావడం కంటే ఇంపార్టెంట్ పనులు నాకు ఎన్నో ఉన్నాయని’’ చెప్పారు. నా పిల్లల క‌న్నా వీడు చిన్నోడు. వీడి పిలుపులో ఎలాంటి అర్థం ఉండ‌దు అంటూ ఆ బుడ్డోడితో స‌ర‌దాగా మాట్లాడింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story