రాజకీయాల్లోకి రాబోతున్న Anasuya.. అందుకే ఈ స్టంట్స్.. జాతకం చెప్పిన Venu Swamy

by sudharani |   ( Updated:2023-08-21 15:37:29.0  )
రాజకీయాల్లోకి రాబోతున్న Anasuya.. అందుకే ఈ స్టంట్స్.. జాతకం చెప్పిన Venu Swamy
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రెచ్చిపోతూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయితే ఎప్పుడు బోల్డ్ షోతో రెచ్చిపోయిన అను.. తాజాగా భావోద్వేగానికి గురైన వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెట్టింట ట్రోల్స్ రావడంతో.. నేను ఆ వీడియో షేర్ చేసింది ట్రోలర్స్‌కు భయపడి కాదంటూ వరుస పోస్ట్‌లు పెడుతుంది. అయితే.. ఇదంతా అనసూయ రాజకీయ స్టంట్ అంటున్నారు నెటిజన్లు. అనసూయ రాజకీయాల్లోకి రావడం ఏంటి అనుకుంటున్నారా..? ఆ విషయాల్లో వెళితే..

బుల్లితెర, వెండితెర నటి, నటుల జాతకాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వేణు స్వామి గతంలో యాంకర్ అనసూయ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు. 2021 తర్వాత అనసూయ జాతకం మొత్తం మారిపోతుంది. ఆమెకు ఏ విషయంలో తిరుగు ఉండదు. చాలా కాలాం పాటు ఇండస్ట్రీలో టాప్‌లో కొనసాగుతుంది. అంతే కాదు అనసూయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయన చెప్పినట్లు ఈ మధ్యకాలంలో అనసూయ ఫాలోయింగ్ మరింత పెరిగి.. ప్రస్తుతం వరుస సినిమాలతో, షోతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే వేణు స్వామి చెప్పినట్లు అనసూయ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుందేమో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

బర్త్‌డే స్పెషల్.. చిన్ని కృష్ణను ముద్దులతో ముంచేసిన సురేఖ, సుప్రియ (వీడియో)

మేము మనుషులమని మరిచిపోవద్దు.. ట్రోలర్స్‌కు చురకలంటించిన Ananya Panday

Advertisement

Next Story