- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలిటిక్స్ ఎంట్రీపై.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ అనసూయ
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. జబర్దస్త్ షో మానేసి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమైంది. వరుసగా సినిమాలతో మెప్పిస్తుంది. రెండు మూడు నెలలకు ఓ మూవీలో అయినా కనిపిస్తుంది. ‘రజాకార్’ అనే చిత్రం నిజాం కాలంలో రాజాకార్ల ఆగడాలను ఇతివృత్తంగా చేసుకుని రూపుదిద్దుకుంది. ఇందులో ముఖ్య పాత్రలో అనసూయ నటిస్తుంది.
ఈ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదల సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. ‘‘నేను ఎవరితోనూ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన చర్చలు జరుపలేదు. నాకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నటిగా కూడా సేవ చేయవచ్చు. అంతో ఇంతో, నాకు సాధ్యమైనంత నీటి బొట్టంతైనా నేను ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాను అదే కంటిన్యూ అవుతుంది. రాజకీయాల్లోకి వెళ్లాలని నేను అనుకోవడం లేదు నాకెవరూ ఆఫర్ చేయలేదు. బయట ఉండి కూడా చాలా ఉద్దరించు వచ్చు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.