Ananya: ఇండస్ట్రీలో మరో పెళ్లి.. ఒక్కటి కాబోతున్న హీరో హీరోయిన్.. త్వరలోనే ప్రకటన

by Prasanna |
Ananya: ఇండస్ట్రీలో మరో పెళ్లి.. ఒక్కటి కాబోతున్న హీరో హీరోయిన్.. త్వరలోనే ప్రకటన
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటులు అనన్యా పాండే-ఆదిత్య రాయ్ కపూర్‌ల రిలేషన్ నెట్టింట చర్చనీయాంశమైంది. కొంతకాలంగా వీరిద్దరూ కలిసి తిరగడం, పలు ఈవెంట్స్‌లో క్లోజ్‌‌గా కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఫ్యాషన్ ఈవెంట్‌లో ఒకరినొకరు తాకుతూ దగ్గరగా కూర్చోవడంతోపాటు ఫొటోలకు స్టిల్స్ ఇస్తున్నపుడు లవ్ బర్డ్స్ లాగే ఫీల్ అయ్యారు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీఠలెక్కబోతున్నారంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతేకాదు సిద్ధార్థ్-కియారాలను ఆదర్శంగా తీసుకుంటూ ఒకరికొకరు చాలా దగ్గరవుతున్నారని, త్వరలోనే తమ బంధం గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇంతకు మించిన ఆనందం ఏం ఉంటుందని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed