‘నాటు నాటు’పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు

by Javid Pasha |   ( Updated:2023-03-13 12:54:24.0  )
‘నాటు నాటు’పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ అవార్డ్ అందుకున్న RRR మూవీపై ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసల జల్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్య ఆనంద్ మహీంద్రా ఆర్ఆర్ఆర్ మూవీని ఆకాశానికెత్తారు. ఈ మేరకు ఆయన ఆస్కార్ అవార్డు స్టేజ్ పై నాటు నాటు పాటను ప్రదర్శించిన వీడియోను ట్వీట్ చేశారు. నాటు నాటు సాంగ్ ఓ పాట కాదని.. అదో మినీ మూవీ అని కొనియాడారు. ఎనర్జీ, ఆశావాదంతో కలిసి పని చేస్తే ఎలాంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చని అని అన్నారు.

‘‘ఇప్పటివరకు ప్రపంచలోని చాలా మందితో స్పెప్పలేయించిన నాటు నాటు సాంగ్.. తాజాగా ఆస్కార్ వేదిక మీద ప్రదర్శింపబడే అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది. ఇంతటి గొప్ప కార్యానికి కారకాలైన రాజమౌళి, ఎంఎం కీరవాణి, చంద్రబోస్ లకు ధన్యావాదాలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఈ వీడియోలో నాటు నాటు సాంగ్ ప్రదర్శనకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ చేశారు.

Advertisement

Next Story