'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ఆకట్టుకుంటున్న రెవల్యూషన్ షేడ్ వీడియో

by srinivas |   ( Updated:2022-08-11 14:59:36.0  )
విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఆకట్టుకుంటున్న రెవల్యూషన్ షేడ్ వీడియో
X

దిశ, సినిమా : సీఎస్ గంటా దర్శకత్వంలో విక్రమ్, అమృతా చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'విక్కీ ది రాక్ స్టార్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ షేడ్ అండ్ లవ్ షేడ్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా.. తాజాగా మరో రెవల్యూషన్ షేడ్ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో 'చచ్చిపోవడం అంటే ప్రాణాలతో లేకపోవడం కాదురా.. ధైర్యం లేకుండా బతకడం కూడా చచ్చినట్టే..' అని తల్లి చెప్పగా.. ఆ పిల్లవాడు 'ధైర్యం కావాలంటే ఏం చేయాలి అమ్మ?' అని అడుగుతాడు. దీంతో 'ధైర్యం కావాలంటే ప్రాణాల మీద ఆశ వదిలి.. పక్కోళ్ల ప్రాణాల కోసం పోరాడాలి.. ధైర్యం తనంతట అదే వస్తుంది' అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.



Advertisement

Next Story

Most Viewed