- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలో Kantara సినిమా చూసే వారికి అదిరిపోయే న్యూస్.. ఆ పాటపై నిషేదం ఎత్తేసిన కోర్ట్
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ 'కాంతార'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దేశవ్యా్ప్తంగా విడుదలైన అన్ని భాషాల్లో సూపర్ హిట్ టాక్ అందుకుంది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి.. 2022 బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక, ఈ సినిమాలోని వరహ రూపం పాట సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, తాయిక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ వరాహ రూపం తమకు చెందిన ట్యూన్ అని.. కాంతార మూవీ యూనిట్ తమ పాటను కాపీ చేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో కోర్టు కాంతార సినిమాలో ఆ పాటను తొలగించాలని ఆదేశించింది. అప్పటి నుండి ఈ వివాదంపై విచారణ జరుగుతోంది. కాగా, ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్ట్ వరాహరూపం సాంగ్‌పై నిషేదాన్ని ఎత్తేసింది. దీంతో ఓటీటీలోనూ కాంతార సినిమాలో మునుపటిలా వరాహ రూపం సాంగ్‌ను రీ ప్లేస్ చేస్తున్నట్లు కాంతార మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికే హైలెట్‌గా నిలిచిన వరహరూపం పాటను మళ్లీ యాడ్ చేస్తుండటంతో మూవీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read....