- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమోషనలైన Sreenu Vaitla.. కారణం ఏమిటంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలు సైతం ఎదురు చూసే వారు. కానీ ప్రస్తుతం అంతా మారిపోయింది. శ్రీను వైట్ల సినిమాలకు దూరమయ్యాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి శ్రీను వైట్ల తన భార్య రూప వైట్ల వీడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తన కూతురిపై ప్రేమను తెలుపుతూ శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్టు చేశారు. ఆయన పెద్దకూతురు ఆనంది అండర్ గ్రాడ్యూయేషన్ కోర్స్ పూర్తి చేయడానికి అమెరికా బయల్దేరింది. దీంతో శ్రీనువైట్ల.. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్ళింది. ఓ తండ్రిగా ఎంతో వేదన కలిగింది ఇదే వయసులో నేను చెన్నై వెళ్తుంటే ఆనాడు మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు అర్థమవుతుంది. జీవితం ఒక చక్రం లాంటిది, నా గారాల పట్టి ఆనంది తండ్రిని గర్వించేలా చేస్తుందని గట్టి నమ్మకం నాకు ఉంది. అంటూ ఆయన తన పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారందరూ శ్రీను వైట్లకు భార్య, పిల్లలు అంటే అమితమై ప్రేమ అంటూ ముచ్చటిస్తున్నారు.
- Tags
- Sreenu Vaitla