ఆయన సెట్‌లోనే దారుణంగా తిట్టేవాడు.. ఏమీ చేయలేక ఏడ్చేదాన్ని

by Hamsa |   ( Updated:2023-04-23 09:32:44.0  )
ఆయన సెట్‌లోనే దారుణంగా తిట్టేవాడు.. ఏమీ చేయలేక ఏడ్చేదాన్ని
X

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషితో సెట్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై అమ్రిన్ ఖురేషి ఓపెన్ అయింది. మిథున్ చక్రవర్తి కుమారుడు నమాషితో కలిసి నటించిన ‘బ్యాడ్ బాయ్’ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న అమ్రిన్.. దర్శకుడు తనను ప్రతిరోజూ సెట్‌లో తిట్టేవాడని చెప్పింది. దీంతో తాను ఏమీ చేయలేక చాలా ఏడ్చానన్న ఆమె ఇద్దరి మధ్య కొద్ది రోజులు ఒక మంచు తుఫాను లాంటి వాతావరణం నెలకొన్నట్లు పేర్కొంది. ‘సినిమా మొత్తం ఉంటానో లేదో అనే అనుమానం కలిగింది. కానీ, కాలక్రమంలో నేను అతని ఇంటెన్షన్ అర్థం చేసుకోగలిగాను. ఆయన కూడా నా భయాన్ని గుర్తించాడు. అలా ఒకరినొకరం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాం’ అని చెప్పుకొచ్చింది.

Also Read.. Pooja hegde: ఐరన్ లెగ్ అంటూ పూజా హెగ్డే మీద కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్


Advertisement

Next Story