- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగులగొట్టిన అమితాబ్
దిశ, వెబ్‌డెస్క్: హీరో పవన్ కల్యాణ్.. కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కీర్తి రెడ్డి నటించిన ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ చిత్ర దర్శకుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘‘అమితాబ్ బచ్చన్ నన్ను కలవడానికి చెన్నై వచ్చారు. అప్పుడు తొలిప్రేమ మూవీ గురించి ప్రస్తావన తీసుకొచ్చి.. సినిమాలో పూర్తిగా నిమగ్నమై చూస్తున్న సమయంలో క్లైమాక్స్ వచ్చింది.
హీరోయిన్ పవన్‌ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, అతనికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న కార్ తాళాలను తీసి స్క్రీన్ మీద విసిరాడట. ఇదేమి క్లైమాక్స్, ఆ అమ్మాయి అలా ఎలా వెళ్ళిపోతుంది, అసలు డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడని కోపంతో పైకి లేచి వెళ్లిపోతున్న టైమ్‌లో జయ బచ్చన్ చిన్నగా క్లాప్స్ కొట్టింది. అమితాబ్ తిరిగి వెనక్కి చూసాక, కీర్తి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇక ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసానని హ్యాపీగా ఫీల్ అయ్యాడట’’ అంటూ వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కరుణాకర్ మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో మరోసారి పంచుకోగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాని లేటెస్ట్ 4K టెక్నాలజీతో రేపు(జూన్ 30) గ్రాండ్‌గా రీరిలీజ్ కాబోతుంది.
Also Read: ‘స్పై’ సినిమా ట్విట్టర్ రివ్యూ సిఖిల్ ఖాతాలో మరో హిట్