- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెడ్ రూమ్‌లో జరిగే ఘోరాలు మీకెలా తెలుస్తాయి.. జ్యూరీ తీర్పుపై స్పందించిన అంబర్
దిశ, సినిమా: మాజీ భర్త జానీ డెప్‌కు అనూకూలంగా వచ్చిన జ్యూరీ తీర్పుపై అంబర్ హర్డ్ మొదటిసారి స్పందించింది. ఈ కేసు మొదట్లో గృహ హింస బాధితురాలిగా చెప్పుకున్న అంబర్.. ఆడియో రుజువు, కొన్ని సాక్ష్యాలతో ప్రజల మద్దతు పొందింది. అయితే అవన్నీ అబద్ధాలుగా బట్టబయలు కావడంతో కోర్టులో జానీకి సపోర్ట్ పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా దీనిపై అంబర్ మాట్లాడుతూ.. 'ఈ విషయంలో జ్యూరీని నిందించలేను. మా గురించి ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ల నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాను. గొప్ప నటుడిగా పేరుగాంచిన జానీ నిజజీవితంలోనూ అమాయకుడి పాత్ర పోషించాడు' అని ఎద్దేవా చేసింది. అలాగే తమ వివాహం, మూసిన తలుపుల వెనుక ఉన్న ఇంటి గోప్యత గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, ఎలాంటి తీర్పులు ఇస్తారనే విషయాన్ని తాను పట్టించుకోనని పేర్కొంది. ఎందుకంటే సగటు మనిషిగా ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని తాను ఎప్పుడూ అనుకోనని, అందుకే తన మంచితనంపై గురిపెట్టి ద్వేషానికి అర్హురాలిననే ముద్ర వేశారని వాపోయింది. చివరగా తాను అబద్ధం చెబుతున్నానని భావించినవాళ్లు ఇప్పటికీ తన కళ్లలోకి చూసి ఇది న్యాయమని చెప్పలేరంటోంది.