- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara: ‘దేవర’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్.. గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్
దిశ, సినిమా: మోస్ట్ వెయిటెడ్ మూవీ ఎన్టీఆర్ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర మూవీతోనే ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
అయితే ఇప్పటికే దేవర నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన చుట్టమల్లె సాంగ్ బాక్సులు బద్దలు కొట్టిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఆగస్టు 16 శుక్రవారం సైఫ్ పుట్టినరోజు కావడంతో దేవర టీమ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులోంచి సైఫ్ క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో ఓ గుడిలో అందరూ భైరా అని అరుస్తుండగా.. కుస్తీలో పోటీల్లో సహపోటీదారుడిని చిత్తుగా కొట్టి కిందపడేస్తాడు. ఆ తర్వాత అడవుల్లో తనను కొంతమంది వెంటాడుతుండగా.. కత్తి తీసుకుని వారిపై దాడి చేస్తాడు. ప్రజెంట్ సైఫ్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అవి చూసిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.